ఆర్బీఐ గుడ్‌న్యూస్..? మళ్లీ భారీగా తగ్గనున్న వడ్డీ రేట్లు..

0
0

RBI Rate Cut: ఆర్బీఐ గత కొంత కాలంగా కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వరుస సమీక్షల్లో 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించింది. ఇప్పుడు జూన్ 6న కూడా రిజర్వ్ బ్యాంక్.. మరోసారి వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఇంకా ఎక్కువే తగ్గించొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇది హోం లోన్ వడ్డీ రేట్లను మరింత కిందికి చేర్చుతుందని చెప్పొచ్చు.