ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తులు చేసుకున్న మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని అల్వాల్ సర్కిల్ వాసులకు అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. మచ్చ బొల్లారం డివిజన్ కీ చెందిన లబ్ధిదారులు స్వప్న రెడ్డి 8500, నరేందర్ 60,000, లక్ష్మయ్య 60,000, సుక్సేన 25000, అల్వాల్ డివిజన్ కు చెందిన లబ్ధిదారులు మల్లేష్ 60,000, అనిత 60,000, వెంకటాపురం డివిజన్ కు చెందిన లబ్ధిదారులు విగ్నేశ్వర్ 60,000 . ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, పవన్ , ప్రశాంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, జావేద్ , తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు, కార్పొరేటర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.