అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారంలోని హిందూ స్మశానవాటికలో అక్రమ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని జరుగుతున్న ఉద్యమానికి మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ లు మద్దతు తెలిపినప్పటికీ, 50 కాలనీ వాసులు సుమారు 200 మంది చాలా రోజుల నుండి నిరసన వ్యక్తం అయినప్పటికీ, అధికారులు డంపింగ్ యార్డ్ ఎత్తివేయకపోగా దానిలో అక్రమంగా కట్టడాలు శరవేగంగా జరుగుతున్నాయని ఆదివారం డంపింగ్ యార్డ్ వద్ద ఆందోళన చేపట్టారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తహసిల్దార్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా ఇది హిందూ స్మశాన వాటిక, స్మశాన వాటికలో అక్రమ డంపింగ్ అక్రమ నిర్మాణాలను అధికారులు ఆపాలని డిమాండ్ చేశారు. కాలనీలో ర్యాలీ, మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు.