కుత్బుల్లాపూర్ తాసిల్దార్ కార్యాలయంలో పనులు సకాలంలో జరగడం లేదు. ఆరోపించిన ఎన్జీవో భాగ్యలక్ష్మి ఫౌండేషన్ ఫౌండర్ మాణిక్య చారి.

0
13

కుత్బుల్లాపూర్ తహసిల్దార్ కార్యాలయం లో గత రెండు నెలల నుండి అధికారులు కుల దృవీకరణ పత్రాలు సకాలంలో అందజేయలేకపోతున్నారని ఎన్జీవో భాగ్యలక్ష్మి పౌండేషన్ ఫౌండర్ మాణిక్య చారి అన్నారు. ముఖ్యంగా కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ లేనందున పనులు సకాలంలో జరగడంలేదని, స్కూల్స్ కాలేజీలు పునః ప్రారంభం అవడంతో విద్యార్థులకు కులం దృవీకరణ, ఆదాయ దృవీకరణ పత్రాలు అవసరం నిమిత్తం వారు తాసిల్దార్ కార్యాలయానికి పోటెత్తారని, కార్యాలయం చుట్టూ బాధితులు తిరగడమే గాని పనులు ఏమాత్రం జరగడం లేదని ఆరోపించారు. కావున సంబంధిత అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకొని తొందరగా వారికి అవసరమైన పత్రాలను అందజేయాలని ఆయన కోరారు.