ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీపై కేసు నమోదు అయింది. మంగ్లీ పుట్టిన రోజు వేడుకల్లో గంజాయి వాడకం జరిగినట్లు గుర్తించిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. తాజాగా, చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు పార్టీ జరిగింది. ఈ పార్టీకి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలెబ్రిటీలు కూడా వెళ్లారు. దివి, కాసర్ల శ్యామ్, రచ్చ రవి, సింగర్ ఇంద్రావతి పార్టీలో పాల్గొన్నారు.అయితే, ఈ పార్టీలో గంజాయి తీసుకుంటూ కొంతమంది పట్టుబడ్డారు. గంజాయితో పాటు విదేశీ మద్యంకూడా పట్టుబడింది. దీంతో మంగ్లీతో పాటు త్రిపుర రిసార్ట్ జీఎం శివరామకృష్టపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.