Home South Zone Telangana వర్షపు నీటికి అడ్డుగా ఉన్న పైపులు : తొలగించిన రైల్వే అధికారులు

వర్షపు నీటికి అడ్డుగా ఉన్న పైపులు : తొలగించిన రైల్వే అధికారులు

0

మేడ్చల్ మల్కాజ్గిరి : ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  కృషితో అల్వాల్ ఆదర్శనగర్ జేవియర్ స్కూల్ సమీపంలోని రైల్వే లైన్ ఆర్‌యు‌బి వద్ద వర్షపు నీరు వెళ్లేందుకు అడ్డుగా ఉన్న ఆర్‌సీసీ పైపులను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తొలగించారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండటంతో సమస్యను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే , అక్కడి వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉన్న ఆర్‌సీసీ పైపులను తొలగించాలని సౌత్ సెంట్రల్ రైల్వే డిఆర్ఎం ని కలిసి విన్నవించగా వారు సానుకూలంగా స్పందించారు.

ఫలితంగా ఈరోజు ఆర్‌యు‌బి కింద అడ్డుగా ఉన్న పైపులు తొలగించబడడంతో నీటి ప్రవాహం సులభంగా సాగేందుకు మార్గం సుగమమైంది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, అల్వాల్ అసిస్టెంట్ ఇంజనీర్ వరుణ్, వర్క్ ఇన్స్పెక్టర్ రామారావు, బిఆర్ఎస్ నాయకులు యాదగిరి గౌడ్ ఫ్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju

Exit mobile version