హైదరాబాద్లోని చాదర్ఘాట్ కాల్పుల కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. నిన్న డీసీపీపై దాడికి యత్నించిన దొంగపై పోలీసులు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో డీసీపీ, గన్మెన్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రౌడీషీటర్ అన్సారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విక్టోరియా గ్రౌండ్స్ ప్రాంతంలో మరోసారి క్లూస్ టీమ్స్ తనిఖీలు చేపట్టాయి.
అన్సారితో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. హైదరాబాద్ నగరంలోని చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజల భద్రత కోసం అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.
