తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రత్యేక అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ప్రజలకు ముందస్తు హెచ్చరికలు పంపేందుకు సోషల్ మీడియా, ఎస్‌ఎంఎస్, వాట్సాప్ వేదికలను వినియోగించాలని సూచించారు. తీరప్రాంతాల్లో SDRF, NDRF బృందాలను మోహరించాల్సిందిగా ఆదేశించారు.
27 వేల సెల్ టవర్లను డీజిల్ జనరేటర్లతో సిద్ధం చేసినట్లు వెల్లడించారు. తుఫాన్ తీవ్రతను బట్టి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించనున్నట్లు తెలిపారు. సముద్రంలో ఉన్న పడవలను వెంటనే వెనక్కి రప్పించాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం జిల్లాలో ఈ చర్యలు అత్యవసరంగా అమలవుతున్నాయి.
