విశాఖపట్నం వేపగుంట అప్పన్నపాలెంలో చోటుచేసుకున్న ఘోర సంఘటన స్థానికులను కలచివేసింది. అత్త జయంతి కనకమహాలక్ష్మి అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల దర్యాప్తులో కోడలు లలితనే ఈ హత్యకు కారణమని తేలింది.
లలిత తన అత్తను హత్య చేయడానికి ముందు వెబ్‌సైట్లు, యూట్యూబ్‌లో హత్య పద్ధతుల గురించి వివరంగా శోధించినట్లు పోలీసులు గుర్తించారు.
పిల్లలకు “దొంగ పోలీస్ ఆట ఆడుతున్నాం” అంటూ చెప్పి, కనకమహాలక్ష్మి కళ్లకు గంతలు కట్టి, చేతులు కాళ్లు కట్టేసి, ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. అనంతరం ఈ ఘటనను ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంగా చూపించేందుకు ప్రయత్నించింది. పోలీసులు లలితను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.




