Tuesday, December 9, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradesh50 మంది విద్యార్థులను కాపాడి తాను ప్రాణాలు వదిలిన బస్ డ్రైవర్‌|

50 మంది విద్యార్థులను కాపాడి తాను ప్రాణాలు వదిలిన బస్ డ్రైవర్‌|

కోనసీమ జిల్లా కొత్తపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. గైట్ ఇంజినీరింగ్‌ కళాశాలకు విద్యార్థులను తరలిస్తుండగా డ్రైవర్‌ దెందుకూరి నారాయణరాజు గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు.

ప్రయాణమధ్యలో అస్వస్థత అనిపించిన ఆయన చాకచక్యంగా బస్సును రోడ్డుపక్కకు ఆపి, విద్యార్థుల ప్రాణాలను రక్షించాడు. తర్వాత జాతీయ రహదారి డివైడర్‌ వద్ద కుప్పకూలాడు. విద్యార్థులు వెంటనే సేఫ్టీ హైవే పెట్రోలింగ్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వగా, వారు ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

తన చివరి క్షణాల్లోనూ 50 మంది విద్యార్థులను కాపాడిన నారాయణరాజు త్యాగం అందరినీ కలిచివేసింది. మంచి మనసున్న డ్రైవర్‌ను కోల్పోయామని కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments