పశ్చిమగోదావరి జిల్లా ముద్దాపురం గ్రామానికి చెందిన బిటెక్ విద్యార్థిని నాగహరిత మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. 2022లో షార్ట్ సర్క్యూట్‌గా పేర్కొన్న ఈ ఘటనను ఫోరెన్సిక్ నివేదిక హత్యగా సూచిస్తోంది.
యువతి తల పగిలి ఉండటం, మరణానికి ముందు తీవ్రంగా కొట్టిన అనంతరం పెట్రోలు పోసి దహనం చేసినట్లు వెల్లడైంది.
ఆస్తి తగాదాలు నేపథ్యంగా ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు నిందితులు కస్టడీలో ఉండగా, అప్పట్లో సరైన విచారణ చేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాజా దర్యాప్తుతో కీలక అంశాలు బయటపడే అవకాశం ఉంది.
