రైతుల సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో ముందడుగు వేశారు. పుట్టపర్తి పర్యటనలో భాగంగా నవంబర్ 19న గుజరాత్‌కు చెందిన 100 జిఐఆర్ ఆవులను ప్రశాంతి నిలయానికి విరాళంగా అందించనున్నారని అధికారులు తెలిపారు.
సత్యసాయి బాబా జయంతి శతాబ్ది ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి భారీగా భక్తులు రానున్నారు. భద్రత కోసం 2,500 అదనపు బలగాలు మోహరించగా, మూడు పెద్ద పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. ప్రశాంతి నిలయం పరిసరాలను డ్రోన్లతో 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో ఇంటింటా ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయి.
