Home South Zone Telangana బోయిన్ పల్లి మార్కెట్ ను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

బోయిన్ పల్లి మార్కెట్ ను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0

సికింద్రాబాద్ : బోయిన్ పల్లి మార్కెట్ లో నెలకొన్న సమస్యలను స్వయంగా తెలుసుకునే ఉద్దేశంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ శుక్రవారం ఉదయం మార్కెట్ పరిశీలనకు వెళ్లి మార్కెట్ మొత్తం కలియతిరిగి రైతులు, వ్యాపారులు,హమాలీలతో  మాట్లాడారు.

వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు,వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు.రైతులు, హమాలీలు, కమీషన్ ఏజెంట్లు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మరియు మౌలిక వసతులైన ఉపయోగం లేని టాయిలెట్లను తొలగించి నూతనంగా నిర్మించాలని, మార్కెట్లో రహదారులు పాడై పోయినందున రహదారులను అభివృద్ధి చేయాలని, మార్కెట్ ను ప్రతిరోజు క్లీనింగ్ చేపించాలని, ఓపెన్ డ్రైనేజీని శుభ్రం చేసి దోమల బారి నుంచి కాపాడాలని కోరారు.

వ్యాపారులు కూడా లైసెన్సుల విషయంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
అనంతరం మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఛైర్మన్, సెక్రటరీ ,కమిటీ సభ్యులు, కమీషన్ ఏజెంట్ల అసోసియేషన్ సభ్యులతో ఎమ్మెల్యే సమావేశమై మార్కెట్ లో నెలకొన్న సమస్యలపై చర్చించి రాష్ట్రంలోనే అతి పెద్దదైన బోయిన్ పల్లి మార్కెట్ లో మెరుగైన మౌలిక వసతులను కల్పిద్దామని, మార్కెట్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

మార్కెట్ ను అభివృద్ధి చేసుకునే అవకాశం మనకు వచ్చిందని కావున మార్కెట్ సమస్యలను అవసరమైతే రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళదామని, మార్కెట్ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు.

మార్కెట్ పరిశీలనలో ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ రాగిరి ఆనంద్ బాబు, సెక్రటరీ వెంకన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

#Sidhumaroju

NO COMMENTS

Exit mobile version