Home South Zone Andhra Pradesh గూడూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ

గూడూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ

0

కర్నూల్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్. జె బాబు ప్రసాద్ కి కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తబ్రేజ్ ఎస్సై హనుమంత రెడ్డి స్వాగతం పలికారు.

తనిఖీకి భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, అలాగే పాత పోలీస్ స్టేషన్ బిల్డింగు పరిసరాలను రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కర్నూల్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ జె బాబు ప్రసాద్ మాట్లాడుతూ..

శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని, గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. డయల్ 100 ఫిర్యాదులపై వేగంగా స్పందించాలన్నారు. సీసీ కెమెరాలు అవశ్యకత గురించి ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు.

రాత్రి జరుపుకునే డిసెంబర్ 31 వేడుకలను ప్రజలు ప్రశాంతంగా ఇళ్ల వద్ద నుండి జరుపుకోవాలని మద్యం సేవించి
రోడ్లపైకి రాకూడదని ఎటువంటి మత్తు పదార్థాలను వినియోగించారాదని సూచించారు.

ఎవరైనా పోలీసుల సూచనలను బ్రేక్ చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్ఐ హనుమంత రెడ్డి ఏఎస్ఐ లక్ష్మీనారాయణ స్టేషన్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Exit mobile version