మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని బృందావన్ కాలనీలోని బంగారు మైసమ్మ కాలనీ ఏరియాలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు 135 డివిజన్ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.
డ్రైనేజ్ రిమోడలింగ్, మరియు సిసి రోడ్లు వేయాలని కార్పొరేటర్ ను కాలనీవాసులు కోరారు. కాలనీల అభివృద్ధి తన లక్ష్యమని త్వరలోనే ఇబ్బందులను తొలగిస్తానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఈ పాదయాత్రలో వాటర్ వర్క్ మేనేజర్ రమేష్ గౌడ్, సూపర్వైజర్ అనిల్, జిహెచ్ఎంసి ఏఈ అరుణ్, కాలనీవాసులు సుదర్శన్ బుద్ధారెడ్డి మోసిన్ తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju
