*నారా లోకేష్ క్రీడా ప్రాంగణం(భోగి ఎస్టేట్స్)లో మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం*
*విశాలమైన క్రీడా ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమైన క్రికెట్ పోటీలు*
*ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి పోటీలను ప్రారంభించిన నారా బ్రాహ్మణి*
*పాల్గొన్న ఎంపీ సానా సతీష్, హీరో సిద్ధార్థ్ నిఖిల్*
*కాసేపు సరదాగా క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచిన నారా బ్రాహ్మణి*
*నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ టోర్నమెంట్*
*క్రికెట్ పోటీలతో సందడిగా మారిన నారా లోకేష్ క్రీడా ప్రాంగణం*
*నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా క్రికెట్ టోర్నమెంట్*
*గెలుపొందిన విజేతలకు రూ. 10 లక్షల విలువైన బహుమతులు ప్రధానం*
*నారా బ్రాహ్మణికి పెద్ద ఎత్తున స్వాగతం పలికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మహిళలు, కూటమి నాయకులు*
