Home South Zone Telangana విపత్తుల సమయంలో తక్షణ చర్యలపై కలెక్టర్ సూచనలు |

విపత్తుల సమయంలో తక్షణ చర్యలపై కలెక్టర్ సూచనలు |

0

మెదక్ జిల్లాలో రెండు ప్రాంతాలలో ఓకే సారి వర్షాలు,వరదలు లాంటి విపత్తులు సంభవించిన జిల్లా యంత్రాంగం ఎలా స్పందించాలి, సహాయక చర్యలు ఎలా సమన్వయంతో నిర్వహించాలి అనే అంశాలపై మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది.ఈ మాక్ డ్రిల్‌ను సోమవారం మెదక్ జిల్లాలోని రెండు లొకేషన్ లలో మొత్తం02 కీలక ప్రాంతాలలో ఏకకాలంలో నిర్వహించారు.

నిరంతర భారీ వర్షాల కారణంగా వరదలు, చెరువులు నిండిపోవడం, రహదారులు దెబ్బతినడం, ప్రజలు మరియు పశువులు నీటిలో చిక్కుకుపోవడం, ఆసుపత్రులు, కాలనీలు నీటమునగడం వంటి విపత్తు పరిస్థితులను ఊహించి ఈ అభ్యాసం చేపట్టబడింది.ముఖ్యంగా మెదక్ టౌన్ పరిధిలోని హవేలి ఘనపూర్ మండలం ధూప్ సింగ్ తండా, బూరుగుపల్లి తదితర ప్రాంతాలలో వరద పరిస్థితులను సృష్టించి, వాటికి సంబంధించిన సహాయక చర్యలను ప్రత్యక్షంగా అమలు చేశారు.

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, డ్రిల్ సాధారణ పరిశీలకులు, కరీంనగర్ డీఎఫ్ఓ శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ ఆర్డీవో రమాదేవి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వేణు, తో సహాయక చర్యల మాక్ డ్రిల్ పర్యవేక్షించారు వర్షాల వలన వరదలు సంభవించి చెరువు నిండి నీటి ప్రవాహం లో చిక్కుకున్న పశువులను,నీటిలో మునిగి కొట్టుకు పోతున్న వ్యక్తిని,నీటి లో చిక్కుకు పోయిన వ్యక్తులను రక్షించేందుకు ఎన్ డి.ఆర్.ఎప్ బృందాాలు పోలీస్,అగ్నిమాపక శాఖ,అటవీ శాఖ,రెవెన్యూ శాఖ,పశు సంవర్ధక శాఖ,ఆపద మిత్ర వాలంటీర్ లు, ఎన్.సి.సి క్యాడేట్ లు.

వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయం తో రక్షణ సహాయక చర్యలు మాక్ డ్రిల్ చేపట్టారు.కలెక్టర్,ఎస్.పి.లు మాక్ డ్రిల్‌ను స్వయంగా పర్యవేక్షిస్తూ దగ్గరుండి నిర్వహించారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ విపత్తుల సమయంలో ముందస్తు సన్నద్ధత, శాఖల మధ్య సమన్వయం ఎంతో కీలకమని తెలిపారు. ఇలాంటి మాక్ డ్రిల్‌ నిర్వహణ ద్వారా అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన అవగాహన పెరిగి, విపత్తు పరిస్థితుల్లో ప్రాణనష్టం.

ఆస్తినష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ప్రజల ప్రాణ నష్టం జరగొద్దని అన్నారు. విపత్తుల సమయంలో అత్యవసరమైతేనే బయటికి రావాలన్నారు. విపత్తు సమయంలో అధికారులు చేరుకునే లోపే గ్రామస్తులు సాధ్యమైనంతవరకు స్వయంగా సహాయకార్యక్రమలు చేపట్టుకోవాలన్నారు. వరద నష్టం జరిగి నష్టపోయిన వారిని ప్రభుత్వం ద్వారా అన్ని రకాల ఆదుకుంటామని తెలియజేశారు.

విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్ పరిశీలకులు కరీంనగర్ డి ఎఫ్ ఓ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్య ఉద్దేశం విపత్తుల వల్ల ఒక్క ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకే ఈలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

NO COMMENTS

Exit mobile version