Home South Zone Telangana సాంకేతిక కారణాల వలన తాత్కాలికంగా వాయిదా |

సాంకేతిక కారణాల వలన తాత్కాలికంగా వాయిదా |

0

మహబూబాబాద్, డిసెంబర్ 21(భారత్ అవాజ్): ముందుగా తెలిపిన షెడ్యూల్ ప్రకారం సోమవారం రోజున మహబూబాబాద్ జిల్లాలో ప్రారంభం కావలసిన నూతన ఎరువుల యాప్ ద్వారా యూరియా పంపిణీ కార్యక్రమం కొన్ని సాంకేతిక కారణాల వలన మన మహబూబాబాద్ జిల్లాకు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ డైరెక్టర్ పేర్కొనడం జరిగినదని.

ఈ నూతన విధానాన్ని రేపు 5 జిల్లాల్లో పైలెట్ గా అమలు చేయడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి యం. విజయనిర్మల తెలిపారు. త్వరలోనే అమలు తేదీని మరల తెలుపుతామని, తదుపరి తేదీ ప్రకటించే వరకు,ఇప్పటి వరకు ఆయా మండలాల్లో అమలవుతున్న పద్ధతిలోనే యధావిధిగా రైతులు యూరియా పొందగలరని కోరారు.

NO COMMENTS

Exit mobile version