Home South Zone Andhra Pradesh గుంటూరు కలెక్టర్ ఆదేశాలు ఈ ఆఫీస్ విధానం అమలు చేయాలి |

గుంటూరు కలెక్టర్ ఆదేశాలు ఈ ఆఫీస్ విధానం అమలు చేయాలి |

0

15 నాటికి అన్ని కార్యాలయంలో ఈ ఆఫీస్ విధానం అమలు చేయాలి గుంటూరు, డిసెంబర్ 23:- జనవరి 15 నాటికి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కారానికి ఈ-ఆఫీస్ విధానం ను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా.

జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, హౌసింగ్, ఉపాధి హామీ పథకం, తదితర అంశాలపై ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీవో లు, మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది లేకుండా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేట్ డీలర్స్ అధిక ధరలకు యూరియా విక్రయుంచకుండా మండల స్థాయి కమిటీ నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు.

దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తుల అమ్మకాల కోసం జనవరి 3 నుంచి 15 వరకు గుంటూరులో నిర్వహిస్తున్న సరస్ 2026 ఎగ్జిబిషన్ పై జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో, పట్టణాల్లో విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలని సూచించారు.

ఉగాది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల గృహా ప్రవేశాలు సిద్ధం చేయడం లో భాగంగా జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు గృహాలను పూర్తిచేసేలా గృహ నిర్మాణం శాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ ఎంపీడీవోలు, తాసిల్దార్లు అవసరమైన చర్యలు ప్రణాళిక ప్రకారం తీసుకోవాలన్నారు.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని పదవ తరగతి విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని ప్రవేశపెట్టిన 100 రోజుల ప్రణాళికను ఖచ్చితంగా అమలు జరిగేలా పాఠశాలలకు నియమించిన నోడల్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

ప్రభుత్వ ప్రాదన్యాత కార్యక్రమాలు, ప్రభుత్వ సేవలపై పబ్లిక్ పర్సెప్షన్స్ లో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ మరింత మెరుగ్గా ఉండేలా క్షేత్రస్థాయి, జిల్లాస్థాయి అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ జిల్లాలో మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేలా వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు.

సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, సీపీఓ శేషశ్రీ, హౌసింగ్ పీడీ ప్రసాదు, డ్వామా పీడీ శంకర్. జిల్లా పౌరసరఫరాల అధికారి కీర్తీ. కోమలి పద్మ, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ , తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version