Home South Zone Andhra Pradesh జీవించింది 55 ఏళ్ళు అయినా తరతరాలకు నిలిచిపోయే పేరు రఫీ సాబ్

జీవించింది 55 ఏళ్ళు అయినా తరతరాలకు నిలిచిపోయే పేరు రఫీ సాబ్

0

జీవించింది_55_ఏళ్ళే_అయినా_తరతరాలకు నిలిచి_పోయే_పేరు_రఫీ_సాబ్_ది

తన_స్వరంతో_అమరత్వం_సాధించాడు.

దీవాన హువా బాదల్…
బహుత్ షుక్రియా బడీ మెహర్బాని…
ఆజ్ మౌసం బడా…బేయిమాన్ హై…
జబ్ జబ్ బహార్ ఆయీ…
జిందగి భర్ నహీ భూలేంగి…
కౌన్ హై జొ సప్నో మే ఆయా….
చౌందీ వీ కా చాంద్ హో…
ఖొయా ఖొయా చాంద్ ఖులా ఆస్మాన్…
బహారో ఫూల్ బర్ సావో…
సుహానీ రాత్ ఢల్ చుకీ…
ఓ హసీనా జుల్ఫోవాలి…
ఆజ్ కల్ తేరే మేరే ప్యార్….
బార్ బార్ దేఖో హజార్ బార్ దేఖో…

ఎలాంటి_పాటలవి! 😍

వింటుంటేనే ఓ ఊపు వచ్చేస్తుంది. ఇక షమ్మీకపూర్ ఊగాడంటే ఊగడా చెప్పండి.

షమ్మీ కపూర్,జాయ్ ముఖర్జీ, రాజేంద్ర కుమార్, భరత్ భూషణ్, బిస్వజిత్, రాజ్ కుమార్, ధర్మేంద్ర,…

వీరంతా_హీరో_స్టేటస్_పొందారంటే…
50% క్రెడిట్ రఫీ సాబ్ కి ఇవ్వాలి.

ఆ స్వర మాధుర్యం..పాటలో భావం పలికించే తీరు అనితర సాధ్యం.

ఎందరికో ఇన్స్పిరేషన్ రఫీ జీ.

మహేంద్ర కపూర్ మొదలు…..మన ఎస్.పి.బాలు వరకు.

భావాన్ని ఎలా పాటలో అల్లుకోవాలో….

రఫీ యే పాడి చూపించారని చెప్పాలి.

సుహానీ రాత్ ఢల్ చుకీ(1949)……తో స్టార్ సింగర్ హోదా వచ్చేసింది రఫీ సాబ్ కి.

ఆపాట ఎంత హిట్ అంటే లతా జీ మళ్ళీ తనూ పాడుకుని రికార్డ్ చేశారు రఫీ సాబ్ కు ట్రిబ్యూట్ గా.

ఇక 25 ఏళ్ళు అప్రతిహతంగా సాగిపోయింది…రఫీ జైత్రయాత్ర….మెలోడియస్ సింగింగ్ కింగ్ లా.

ముఖ్యంగా హిందీ, మరాఠీ, ఉర్దు, తెలుగు భాషల్లో పాడినా…17 భాషల్లో పాడారాయన.

1950 – 1975…..కాలం…..రఫీ,ముఖేష్, కిషోర్ కుమార్, మహేంద్ర కపూర్, మన్నాడే,…..లది. హిందీ మధుర గీతాల స్వర్ణయుగం.

హిందీ సినీ గాన విభావరిలో 1950 నుండి 1975 కాలం మహమ్మద్ రఫీ యుగం అంటే అతిశయోక్తి గాదు.

రఫీ, లతా మంగేష్కర్ ల గాయక జోడీ, హిందీ నేపథ్యగాన చరిత్రలో కొత్త ఒరవడిని, రికార్డును సృష్టించింది.

లతా జీ రాయల్టీ వివాదంతో…ఇద్దరూ కలిసి 4 ఏళ్ళు డ్యూయెట్స్ పాడలేదు.

ఆ పీరియడ్లోనే కిషోర్ కుమార్ -లతా ల యుగళాలు అద్భుతాలు చేశాయి.

రఫీ జీ…సుమన్ కళ్యాణ్ పూర్, హేమలత & వాణీ జయరాం…ఇంక కొందరు గాయనీ మణులతో పాడినా…

ఎవ్వరూ అక్కడ నిలబడ లేక పోయారు.
అన్నట్లు ఆశాజీ రఫీ పార్టీయే.

ఆ తరువాత రాజీ పడ్డారు…4 ఏళ్ళయ్యాక.

కేవలం రఫీ పాటలతో వందల కొద్దీ చిత్రాలు టాప్ హిట్స్ అయ్యాయి.

రాజేంద్రకుమార్, షమ్మీ కపూర్ రఫీ పాటలతోనే బాలీవుడ్ లో దూసుకు పోయారు!

రాజేంద్రకుమార్ కేవలం రఫీ పాటలతోనే సిల్వర్ జూబిలీ హీరో అయ్యాడు.

కొందరు హీరోలు….కేవలం రఫీ గానం తోనే పేరు తెచ్చుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు…
ఓ భరత్ భూషణ్…ఓ జాయ్ ముఖర్జీ.

ఏవో లెక్కలవీ వేస్తుంటారు గానీ…
రఫీ సాబ్..పాడింది…షుమారు 5 వేల పై చిలుకు పాటలే…అన్ని భాషలలో కలిపి.
ఎన్నెన్ని…ఆ పాత మధురాలు…

మనస్సును పులకరింప చేసి…..తన స్వర మాధురితో….తనలో ఆవాహన చేసుకునే సమ్మోహన శక్తి……రఫీ సాబ్ ది.

ఎందరో వీరాభిమానులు…అఖండ భారతావనిలో…..

ఎన్నో గ్రూపులు రఫీ సాబ్ కి.

రఫియాలజీ…..అనే పేరున కూడా ఓ గ్రూప్ ఉంది!

పంజాబ్ లోని కోట్లా సుల్తాన్ పూర్ లో 24 -12 – 1924 లో జన్మించాడు.
తండ్రి హాజి అలి మహమ్మద్.

రఫీ హిందుస్థానీ క్లాసికల్ సంగీతం..
ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్,
ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్,
పండిత్ జీవన్ లాల్ మట్టూ,
ఫిరోజ్ నిజామి….ల వద్ద అభ్యసించాడు.

ఒక రోజు తన మామ హమీద్ తోడు రాగా… ప్రఖ్యాత గాయకుడు కె.ఎల్. సైగల్ గారి… గానకచ్చేరి చూడడానికి వెళ్ళాడు.

విద్యుత్ అంతరాయం వలన సైగల్ పాడడానికి నిరాకరించాడు.

హమీద్ నిర్వాహకుల అనుమతి పొంది రఫీని పాడనిచ్చాడు. అపుడు రఫీ వయస్సు 13 సంవత్సరాలు.

శ్యాంసుందర్ అనే సంగీతకారుడు రఫీని గుర్తించి పంజాబీ సినిమా (1942) గుల్ బలోచ్లో జీనత్ బేగం తో డ్యూయెట్ కు.ఛాన్సిచ్చాడు.

అదే రఫీ మొట్ట మొదటి సినిమా పాట..

1942 లో మొదలైనా….సుహానీ రాత్ ఢల్ చుకీ( 1949) తో గానీ స్టార్ సింగర్ హోదా రాలేదాయనకు.

రఫీ తెలుగు లో పాడడం……జగ్గయ్య గారి చలువే. సిఫారసు చేసి…..నాగయ్య గారి భక్త రామదాసు లో పాడించారు….కబీరు పాత్ర వేసిన గుమ్మడి గారికి.

అలా అడపా దడపా తెలుగు లో పాడినవన్నీ ఇక నందమూరి కే.

భలే తమ్ముడు,
తల్లా – పెళ్ళామా,
రాం – రహీం,
ఆరాధన,
అక్బర్ – సలీం – అనార్కలి.

ఆ విధంగా ఎన్.టి.ఆర్ , హరికృష్ణ & బాల కృష్ణలకు పాడారు రఫీ సాబ్.

కానీ విమర్శలు లేక పోలేదు. నిజమే కదా….తెలుగు పట్టి పట్టి పాడేవారాయన. కొందరికది నచ్చేది కాదు.

అంతే మరి.

ఘంటసాల మాస్టారు హిందీ లో పాడితే……తెలుగు లో పాడినట్లే ఉంటుంది!

ఆ మాహా గాయకులిద్దరూ ఇద్దరే!

ఆ ఇద్దరూ పాడిన ఒక పాట……

పయనించే ఓ చిలుకా ఎగిరిపో…

బాగా గమనిస్తే…..ఘంటసాల వారు ఎక్కువ మార్కులు కొట్టేస్తారు.

అలా అని రఫీ ని చిన్నబుచ్చడం కాదండి. అలాంటి సాకీ పాటలు ఘంటసాల వారి వాయిస్ లో అద్భుతంగా ఉంటాయి.

ఇక అవార్డుల కొస్తే…

1977 లో క్యా హువా తేరా వాదా…..పాట కు….బెస్ట్ సింగర్ నేషనల్ అవార్డ్.
21 – ఫిల్మ్ ఫేర్ అవార్డులు,
3- జర్నలిస్టు అవార్డులు,
1948 – ప్రధాని నెహ్రూ చేతుల మీదుగా రజత పతకం,
1967 – పద్మశ్రీ పురస్కారం.

ఆయన పోయాక –
2001 – బెస్ట్ సింగర్ ఆఫ్ ది మిలినియం,
2013 – గ్రేటెస్ట్ వాయిస్ ఇన్ హింది సినిమా అవార్డ్.

వ్యక్తిగతానికొస్తే…..

ఇద్దరు భార్యలు. మొదటి భార్య – బషీరా బీబి(1938-42)
2 వ భార్య బిల్ కిస్ భానో……(1945….1980)
బిల్ కిస్ భానో ….పిల్లలంటే ప్రాణం పెట్టేవారు.

7గురు పిల్లలాయనకు.

బ్యాడ్ మింటన్….బాగా ఆడేవారు.

వర్ధమాన గాయనీ గాయకులకు దిక్సూచి వంటి రఫీ సాబ్ పేరు చిరస్థాయి గా ఉంటుందని చెప్పడం అతిశయోక్తి కాదు.

1980 జూలై 31 న తీవ్రమైన గుండెపోటు తో మరణించారు రఫీ సాబ్ 55 ఏళ్ళకే!

వారి చివరి గీతం…..ఆస్ పాస్ కోసం పాడిన..

షాం క్యో ఉదాస్ హై దోస్త్..
తు కహీ ఆస్ పాస్ హై దోస్త్……

ఈ చివరి పాటే కాదు. వారి అన్ని పాటలూ…..ఇంకా శతాబ్ధాల వరకు వినిపిస్తూనే ఉంటాయి.

జుహు ముస్లిం బరియల్ గ్రౌండ్ లో సమాధి చేసినా….2010 లో స్థలం చాలక…ఆయనదే కాదు…మధుబాల సమాధితో సహా….కొట్టేశారు.

వారి వీరాభిమానులు…బర్త్ & డెత్ యానివర్సరీ లకు సమాధి దగ్గరకెళ్ళి వచ్చే అదృష్టం ఇప్పుడు లేదు.

ఓ తాటి చెట్టు ప్రక్కనే సమాధి కనుక ఆ తాటి చెట్టునే దర్శించుకు వస్తారట.

ఘంటసాల వారి వలె…..రఫీ సాబ్ కూడా ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటారు.

కనిపించకపోయినా.

ఈ_రోజు_మహమ్మద్_రఫీ_జీ_జయంతి.(24-12-1924) వారికీ ఆత్మీయ స్మృత్యంజలి

NO COMMENTS

Exit mobile version