పక్క సమాచారంతో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడి
అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత
జర్నలిస్ట్ డైరీ కోడంగల్ డిసెంబర్ 23:-
నారాయణ పేట జిల్లా కోడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండలం ధమగన్ పూర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇంటిపై పక్క సమాచారంతో సివిల్ సప్లై అధికారులు దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 29.40 క్వింటల్ల బియ్యన్ని పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు సివిల్ సప్లై అధికారి ఆనంద్ తెలిపారు.
బలిజ వీరేష్ ఇంట్లో అద్దెకు ఉంటున్న శశిదర్ అనే వ్యక్తి అక్రమంగా నిల్వ ఉంచినట్లు తెలిపారు.పట్టుబడిన బియ్యన్ని సిజ్ చేసి నాగిరెడ్డి పల్లి డీలర్ లలిత షాప్ నెంబర్ 4605005 అప్పగించి రసీదు పొందినట్లు తెలిపారు అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచిన తరలించిన క్రిమినల్ కేసులు తప్పవని సివిల్ సప్లై అధికారి ఆనంద్ హెచ్చరించారు.రేషన్ బియ్యం నిల్వ చేసిన శశిధర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
