విజయవాడ
24-12-2025
ప్రచురణార్థం
సెమి క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు*
స్థానిక 56వ డివిజన్ రాజరాజేశ్వరిపేట లోని బీర్వాల కంపెనీ వద్ద వైసిపి నాయకులు రాకోటి శ్రీను ఆధ్వర్యంలో సెమి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ మాజీ శాసన సభ్యులు, సెంట్రల్ వైసిపి ఇంచార్జ్ మల్లాది విష్ణు పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు చేసి ముందస్తు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి, క్రిస్మస్ సందేశాన్ని వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ యలకల చలపతిరావు తదితరులు పాల్గొన్నారు
