Home South Zone Andhra Pradesh ముక్కోటి ఏకాదశి మహోత్సవానికి ఎమ్మెల్యేకి ఆహ్వానం ! |

ముక్కోటి ఏకాదశి మహోత్సవానికి ఎమ్మెల్యేకి ఆహ్వానం ! |

0

కర్నూలు : నంద్యాల : బేతంచర్ల : డోన్ :
ఈ రోజు డోన్ ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో, బేతంచెర్ల మండలంలోని ఆర్.ఎస్. రంగాపురం గ్రామ శివారులో ఉన్న ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీ ఘన మద్దిలేటి స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న ముక్కోటి ఏకాదశి మహోత్సవాల సందర్భంగా గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారిని దేవస్థానం కార్యనిర్వాహక అధికారి (ఈఓ) శ్రీ రామాంజనేయులు గారు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, శ్రీ ఘన మద్దిలేటి స్వామి దేవస్థానం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడాలని ఆకాంక్షించారు. దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, ఆలయ ప్రతినిధులు మరియు ఇతర అధికారులుపాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version