Home South Zone Andhra Pradesh విజయవాడ భవానిపురం జోజి నగర్ ప్రజలకు ఎంపీ కేశినేని భరోసా |

విజయవాడ భవానిపురం జోజి నగర్ ప్రజలకు ఎంపీ కేశినేని భరోసా |

0

జోజి న‌గ‌ర్ 42 ప్లాట్ యజమానులకు ఎంపీ కేశినేని చిన్ని భరోసా
ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను క‌లిసిన బాధిత ఫ్లాట్ యజమానులు

విజ‌య‌వాడ : ప‌శ్చిమ నియోజ‌క‌వర్గం భ‌వానీ పురం జోజిన‌గ‌ర్ కు చెందిన 42 మంది బాధిత ప్లాట్ యాజ‌మానులు ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను బుధ‌వారం గురునాన‌క్ కాల‌నీలోని ఆయ‌న కార్యాల‌యంలో క‌లిశారు.

ప్లాట్ విష‌యంలో త‌మ‌కి జ‌రిగిన అన్యాయం గురించి మొర‌పెట్టుకున్నారు. ప్లాట్ ల విష‌యంలో ఎదుర‌వుతున్న ఇబ్బందుల‌ను ఎంపీ కేశినేని శివ‌నాథ్ కు బాధితులు వివ‌రించారు. ఈ విష‌యం పై సానుకూలంగా స్పందించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఇప్ప‌టికే ఈ విష‌యం త‌న దృష్టికి వ‌చ్చింద‌ని.

.దీనిపై పూర్తిస్థాయి విచార‌ణ జ‌రిపించి వివ‌రాలు తెలుసుకుంటాన‌ని, అన్యాయం జ‌ర‌గ‌నివ్వ‌ని, త్వ‌ర‌లోనే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి న్యాయం జ‌రిగేలా చూస్తాన‌ని వారికి హామీ ఇచ్చారు.

ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను క‌లిసిన వారిలో ప్లాట్ ఓన‌ర్స్ ప్ర‌వీణ్, లక్ష్మీనారాయ‌ణ‌, ఎల్ల‌రావు, విజ‌య‌ల‌క్ష్మీ, బి.ఎల్ల‌రావు, మంజునాథ్ ల‌తో పాటు త‌దిత‌రులు వున్నారు.

NO COMMENTS

Exit mobile version