Home South Zone Andhra Pradesh విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు అగ్నికి ఆహుతి |

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు అగ్నికి ఆహుతి |

0

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం జె.అన్నవరం గ్రామంలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్న “మిరియాల గనెమ్మ” ఇల్లు రాత్రి 1 గంట ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ఏర్పడిన మంటలకు గుడిసె పూర్తిగా కాలిపోయింది, ఇంట్లో ఉండే నగదు .

నిత్యావసర వస్తువులు, బట్టలు, ఇతర సామాగ్రి కాలి బూడిదయ్యింది… స్వల్ప గాయలతో కుటుంబం అంతా ప్రాణప్రాయంతో బయటకు పరుగులు తీశారు.. ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఆ కుటంబాన్ని పలువురు పరామర్శించారు.

ఈ సంఘటన తెలుసుకుని మాజీ సొసైటీ చైర్మన్ కొండపల్లి వెంకటేశ్వరరావు గారు, వైసీపీ చెందిన పెద్దలు పలివెల వీరబ్బాయి గారు, నాయకులు, దళిత నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించి జరిగిన ప్రమాద సంఘటన గురుంచి తెలుసుకుని .

ఆ కుటంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ధైర్యంగా ఉండమని భరోసా కల్పించి ఆ కుటంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించి, సర్వం కోల్పోయిన కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా ఆడుకోవాలని కోరడం జరిగింది..

# Dadala Babji

NO COMMENTS

Exit mobile version