*గతంలో ఏ ఎంపీ ఎస్.హెచ్.జి మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించలేదు*
*ఎంపీ కేశినేని శివనాథ్ కృషిని కొనియాడిన ఎమ్మెల్యేలు బొండా, గద్దె*
*సీఎం చంద్రబాబు ఆలోచనల ప్రతిరూపమే నైపుణ్యాభివృద్ది శిక్షణా కార్యక్రమం*
*చెదలు-బొద్దింకలు-దోమల నివారణ చర్యలపై శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి*
*ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె, బొండా, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్సీ బుద్దా హాజరు*
*చెదలు-బొద్దింకలు-దోమల నివారణ చర్యలపై శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్స్ అందజేత*
*ఎంపీ కేశినేని శివనాథ్, కేశినేని ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎస్.హెచ్.జి మహిళలు*
విజయవాడ : ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటి వరకు ఏ ఎంపీ స్వయం ఉపాధి రంగంలో కేంద్ర సంస్థలు అందించే నైపుణ్యాభివృద్ది శిక్షణకు ఏ మహిళలను పంపించలేదని…ఎస్.హెచ్.జి మహిళల జీవనోపాధి మెరుగుపర్చేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ తన సొంత నిధులతో హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి లో శిక్షణ ఇప్పించటం చాలా గొప్ప విషయమంటూ ఎంపీ కేశినేని శివనాథ్ కృషి ని ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ అభినందించారు. అలాగే ఎంపీ కేశినేని శివనాథ్ సీఎం చంద్రబాబు ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామిక వేత్త వుండాలన్న ఆలోచనలకు ప్రతిరూపమే ఎస్.హెచ్.జి మహిళలకు ఎన్.ఐ.ఆర్.డి లో నైపుణ్యాభివృద్ది శిక్షణా కార్యక్రమం అన్నారు.
ఎంపీ కేశినేని శివనాథ్ సారథ్యంలో కేశినేని ఫౌండేషన్, ఎన్వు ఇండియా మరియు ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా మెప్పా ఎస్.హెచ్.జి మహిళలకు ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో చెదలు-బొద్దింకలు-దోమల నివారణ చర్యలపై శిక్షణా కార్యక్రమం జరిగింది.
ఈ శిక్షణా ముగింపు కార్యక్రమం బుదవారం ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ తో పాటు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూడు రోజలు శిక్షణ ను విజయవంతంపూర్తి చేసిన 50 మంది మహిళలకు సర్టిఫికెట్స్ అందజేశారు. అలాగే చెదలు-బొద్దింకలు-దోమల నివారణ చర్యలపై శిక్షణను అందించిన ఎన్.ఐ.ఆర్.డి ఫెస్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ కో ఆర్డినేటర్ ఉదయ్ మీనన్, కీటకాల మేనేజ్మెంట్ ట్రైనర్ జి.ఎస్.ఎస్.ప్రకాష్ లను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి జిల్లాలోని మెప్పా, డ్వాక్రా మహిళలకు ఆర్థిక పరమైన సహకారం లభిస్తుందని, అయితే స్వయం ఉపాధి రంగంలో ఏ వ్యాపారం చేయాలి…అందుకు ఎక్కడ శిక్షణ తీసుకోవాలనే వాటిపై వారికి అవగాహన లేదన్నారు. అందుకే కేశినేని ఫౌండేషన్ ఎన్.ఐ.ఆర్.డి సహకారంతో ఎస్.హెచ్.జి మహిళలకు నైపుణ్యాభివృద్దిపై శిక్షణ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
ప్లాస్టిక్ వాడకం నిషేధం కావటంతో పేపర్ ఉత్పత్తులకు, జ్యూట్ బ్యాగులకు మార్కెట్లో మంచి గిరాకీ వుంది. అందుకే ఆ ఉత్పత్తులతో పాటు వర్మికంపోస్టింగ్, , బయో పెస్టిసైడ్స్ అండ్ నీమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ , వర్మికంపోస్ట్, ముష్రూమ్ కల్టివేషన్ అండ్ ప్రొసెస్, హనీ మేకింగ్ ప్రొసెపింగ్, సోయా అండ్ మిల్లేట్ ప్రొడక్ట్స్ ప్రిపరేషన్, లీఫ్ ప్లేట్ అండ్ కప్ మేకింగ్, డైయింగ్ అండ్ వీవింగ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ , హ్యాండ్ మేడ్ పేపర్, ట్రైబుల్,ఫ్యాషన్ అండ్ పేపర్ జ్యువెలరీ , హోమ్ బేస్ట్ ప్రొడక్ట్స్ , బంజారా డ్రెస్ తయారీ, బంజారా జ్యువెలరీ పై కూడా శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు.
ఈ డిసెంబర్ లోనే దాదాపు 400 మంది ఎస్.హెచ్.జి మహిళలకు ఎన్.ఐ.ఆర్.డి లో శిక్షణ ఇప్పించటం జరిగిందన్నారు. వీరికి శిక్షణ ఇప్పించటమే కాకుండా వారు తయారు చేసే వస్తువులకు కూడా మార్కెటింగ్ సపోర్ట్ అందిస్తామని భరోసా ఇచ్చారు. డ్వాక్రా బజార్లు, మెప్పా బజార్లు ఏర్పాటు చేసి రోటేషన్ పద్దతిలో వారం రోజులు ఉచితం ఎస్.హెచ్.జి మహిళలకు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నాట్లు తెలిపారు.
అర్బన్ ఎస్.హెచ్.సి, డ్వాక్రా మహిళలకు మూడు రోజులు చెదలు-బొద్దింకలు-దోమల నివారణ చర్యలపై శిక్షణ ఇప్పించటం జరిగిందన్నారు. సిటీలో దోమలు, బొద్దింకలు,చెదలు నివారణ చాలా ముఖ్యమన్నారు. ఫెస్ట్ కంట్రోలర్స్ కి చాలా డిమాండ్ వుందన్నారు. ఈ రంగంలో మహిళలు రాణించటానికి చాలా అవకాశం వుందన్నారు.
ప్రతి నెల 250 మంది మహిళలకు నైపుణ్యాభివృద్ది శిక్షణా ఇప్పించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. విజయవాడలో మూడు , ఎన్.ఐ.ఆర్.డి మూడు బ్యాచ్ లకు శిక్షణ అందించే విధంగా ప్రణాళిక రూపకల్పన చేయటం జరిగిందన్నారు.
ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాయన్నారు. ఎన్డీయే కూటమి మహిళల సాధికారత మొదటి ప్రాధాన్యత గా భావిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో ఎన్టీఆర్ జిల్లా అభివృద్దితో పాటు ఎస్.హెచ్.జి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ చేస్తున్న శ్రమ ఫలిస్తోందన్నారు.
సిల్క్ డెవలప్ మెంట్ ద్వారా స్వయం ఉపాధి రంగంలో శిక్షణ ఇప్పిస్తున్నారని తెలిపారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్.ఎస్.ఎమ్.ఈ పార్క్ లు ప్రతి నియోజకవర్గంలో నెలకొల్పేందుకు కృషిచేస్తున్నారని తెలిపారు. ఎన్.ఐ.ఆర్.డి లో శిక్షణ పొందే మహిళలకు ఎమ్.ఎస్.ఎమ్.ఈ పార్క్ లు ఎంతో ఉపయోగంగా ఉంటాయన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ చొరవ , కృషి వల్ల మాత్రమే మహిళలకు శిక్షణ ఇప్పించటం సాధ్యపడిందన్నారు.
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ పురుషుల కంటే మహిళలు శక్తివంతులు అని గుర్తించి వారిని ప్రోత్సహించిన తొలి ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన సీఎం అయిన ప్రతిసారి మహిళల కోసం ఒక కొత్త పథకం ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి పునాది వేశాడన్నారు. సీఎం చంద్రబాబు స్పూర్తితో ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్.ఐ.ఆర్.డి ను సందర్శించి అక్కడ
అందించే నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యాక్రమాలపై అవగాహన పెంచుకుని… ఎస్.హెచ్.జి మహిళలకు శిక్షణ ఇప్పించి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయటం శుభపరిణామన్నారు. ప్రస్తుతం ఫెస్ట్ కంట్రోల్ కు మంచి డిమాండ్ వుందని, నగరంలో ఫెస్ట్ కంట్రోలర్స్ అవసరం చాలా వుందన్నారు. ఈ శిక్షణను అందిపుచ్చుకుని మహిళలు ఈ రంగంలో రాణించాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర దూదేకుల కార్పారేషన్ చైర్మన్ నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్సీ టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న మాట్లాడుతూ జిల్లా అభివృద్ది తో పాటు ప్రజల జీవనోపాధి మెరుగుదలకు చక్కటి ప్రణాళికతో ఎంపీ కేశినేని శివనాథ్ ముందుకు వెళుతున్నాడని కొనియాడారు. ఇక్కడ శిక్షణ నేర్చుకున్న మహిళలు..ఇంకొంత మంది మహిళలు శిక్షణ తీసుకునే విధంగా స్పూర్తి అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎన్వు ఇండియా కంపెనీ ప్రతినిధి మొక్కపాటి అనిల్ కుమార్, ఎన్.ఐ.ఆర్.డి అధికారి మురళీ కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి రూరల్ కో ఆర్డినేటర్ సొంగా సంజయ్ వర్మ, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి అర్బన్ కో ఆర్డినేటర్ వల్లభనేని నరసింహాచౌదరి, ఎన్టీఆర్ జిల్లా మెప్పా అధ్యక్షురాలు మీనాక్షి, టిడిపి నాయకులు మాదిగాని గురునాధం, యెర్నేని వేదవ్యాస్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
