Friday, February 13, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshచౌకబారు విమర్శలే వైసీపీ వ్యూహం |

చౌకబారు విమర్శలే వైసీపీ వ్యూహం |

రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకోవడానికే వైసీపీ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారు తప్ప, వారికి నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ది లేదని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర విమర్శించారు. వైసీపి నాయకులు శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పై మంగళవారం పత్రికా ముఖంగా చేసిన ఆరోపణలను మేయర్ బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపి 5ఏళ్ల పాలనను తిరస్కరించి, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి అధికారాన్నిచ్చారన్నారు. వైసీపి నాయకులు సంస్కారం లేకుండా ఇష్టం వచ్చినట్లు అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారన్నారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసి అడ్డుకోవాలని చూసినా, శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం నిర్దేశిత సమయానికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విద్యావంతులు.

సంస్కారవంతులని ఎన్నో సంస్థలను ఏర్పాటు చేసి ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్నారన్నారు. అటువంటి వ్యక్తి నేడు గుంటూరు ఎంపిగా గెలిచి, కేంద్ర మంత్రి అయ్యారన్నారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల అనతి కాలంలోనే గుంటూరు అభివృద్దికి రూ.5 వందల కోట్లు కేంద్ర నిధులను తెచ్చారన్నారు. సదరు నిధులతో రానున్న కాలంలో నగర ప్రజలకు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి నందివెలుగు రోడ్డులో ఎంతో కాలంగా నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులు, శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం.

ఇన్నర్ రింగ్ రోడ్డులోని బ్రిడ్జ్ నిర్మాణానికి, పలకలూరు బ్రిడ్జి నిర్మాణానికి మరియు మిర్చ్ యార్డ్ వద్ద బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేస్తున్నారని తెలియచేశారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయుటకు అన్నివిభాగాల అధికారులు, ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతం చేస్తున్నారన్నారు. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం 2027 మార్చి నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తామన్నారు.

నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ప్రత్తిపాడు నియోజకవర్గ శాససన సభ్యులు బూర్ల రామాంజనేయులు గుంటూరు రూరల్ మండలంలోని గ్రామాలను విలీనం చేయాలని ప్రతిపాదించారని, సభ్యులు అభిప్రాయాలు తీసుకున్న అనంతరం ఈ 11 గ్రామాలతో పాటు నగరానికి దగ్గరగా ఉన్న మరో 7 గ్రామాలను కలిపి మొత్తం 18 గ్రామాలను విలీనం చేయుటకు మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారన్నారు.

ముఖ్యమంత్రివర్యులు గ్రేటర్ విజయవాడ దిశగా అడుగులు వేస్తున్నారని, అలాగే గ్రేటర్ తిరుపతి అని ప్రతిపాదనలు చేస్తున్నారని, వాటికి అనుగుణంగానే గుంటూరు నగరాన్ని కూడా గ్రేటర్ గుంటూరు చేయుటకు నగర పాలక సంస్థకు దగ్గరగా ఉన్న గ్రామాలను విలీనం చేయడానికి ఆమోదం తెలిపామన్నారు. సదరు గ్రామాల్లో ఇప్పటికే త్రాగునీరు, రోడ్లు వంటి మౌళిక సదుపాయాలూ ఉన్నాయన్నారు.

విజయవాడ మరియు వైజాగ్ ల కంటే గుంటూరు నగరం ఎప్పుడో అభివృద్ధి చెందిందని, బ్రిటిష్ కాలంలోనే గుంటూరు నగరంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయబడ్డాయన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకునే గుంటూరు నగరాన్నిరాజధాని అమరావతి నగరానికి ధీటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్, గుంటూరు ఎంపి, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ ల సహకారంతో గుంటూరు నగరాన్నిసమగ్రాభివృద్ధి చేయుటకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments