Home South Zone Andhra Pradesh గుంటూరు లాలాపేట, కొత్తపేట పోలీస్ స్టేషన్లలో మాదకద్రవ్యాలు పట్టివేత

గుంటూరు లాలాపేట, కొత్తపేట పోలీస్ స్టేషన్లలో మాదకద్రవ్యాలు పట్టివేత

0

100 గ్రాముల లిక్విడ్ గంజాయి, 3.2 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి గారు,.

గుంటూరు జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై పోలీస్ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు.

ఈ క్రమంలో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ Sk.అబ్దుల్ అజీజ్ గారి పర్యవేక్షణలో, కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మరియు మాదక ద్రవ్యాల కార్యకలాపాలను నిరోధించేందుకు కొత్తపేట సీఐ శ్రీ ఎం. వీరయ్య చౌదరి గారు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.

నిన్న రాత్రి కొత్తపేట ఎస్‌ఐ శ్రీ ఎన్. రవికిరణ్ రెడ్డి గారు మరియు పోలీస్ సిబ్బంది (PCs డేగల కోటేశ్వరరావు, వి. జానీ భాష, టి. అనిల్ కుమార్, చ. శ్రీనివాసరావు, ఎన్‌ఎస్‌ఆర్ కోటేశ్వరరావు) నెహ్రూ నగర్, న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ క్వార్టర్స్ ప్రాంతంలో గంజాయి మరియు MDMA డ్రగ్స్ అమ్ముతూ, సేవిస్తున్నారనే సమాచారం మేరకు రైడ్ నిర్వహించారు.

రైడ్‌లో భాగంగా నెహ్రూ నగర్‌కు చెందిన పఠాన్ మున్నా మరియు చిల్లర ప్రేమ్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద 100 గ్రాముల లిక్విడ్ గంజాయి మరియు 3.2 గ్రాముల MDMA డ్రగ్స్ లభించాయి. వెంటనే వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది.

అరెస్ట్ చేసిన నిందితులను గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు వారు ఇద్దరికీ 14 రోజుల న్యాయ రిమాండ్ విధించారు.

కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలను అమ్మినా, సేవించినా, సరఫరా చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఈస్ట్ డీఎస్పీ శ్రీ స్కె. అబ్దుల్ అజీజ్ గారు హెచ్చరించారు.

#Kvsr. Koteswararao. Guntur

NO COMMENTS

Exit mobile version