నెన్నెల: సర్పంచ్ ను దూషించిన వ్యక్తిపై కేసు నమోదు
నెన్నెలా మండలం గొల్లపల్లి సర్పంచ్ జాడి లక్ష్మిని, ఆమె భర్త నారాయణను దూషించిన పోతరాజుల సురేష్‌పై కేసు నమోదైంది.
మహిళా సంఘం భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలిస్తున్న సర్పంచ్‌ను మద్యం మత్తులో సురేష్ దూషించి, చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించాడని ఎస్సై ప్రసాద్ తెలిపారు. సర్పంచ్ భర్త తనను దూషించాడని సురేష్ ఫిర్యాదు చేయడంతో, నారాయణపై కూడా కేసు నమోదు చేశారు.
