Home South Zone Telangana ఆల్వాల్ ల్లో మూడవ కన్ను సిసి కెమెరాలతో పటిష్టమైన నిఘా .|

ఆల్వాల్ ల్లో మూడవ కన్ను సిసి కెమెరాలతో పటిష్టమైన నిఘా .|

0

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : అల్వాల్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం పెరుగుతున్న జనాభా కు అనుగుణంగా భద్రతను పర్యవేక్షించడం సవాలుగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకొని పోలీసులు “నేను సైతం” మరియు “కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టు” కింద స్థానిక వ్యాపారులు నివాసితుల సహకారంతో నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాలు దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి అనేక నేరాలలో సహాయపడతాయి.

సున్నిత ప్రాంతమైన, మచ్చ బొల్లారం మార్కెట్ ప్రధాన రహదారులు, వాణిజ్య సముదాయాలు ఉండే జంక్షన్ లు, మరియు అంతర్గత కాలనీ ఎంట్రీ పాయింట్ల వద్ద 8 కెమెరాలను  బిగించారు. వీటి ద్వారా లభించే ఫీడ్ ను స్థానిక పోలీస్ స్టేషన్ లేదా కమాండ్ సెంటర్ కు అనుసంధానించడం ద్వారా పోలీసులు నిరంతర నిఘా ఉంచుతున్నారు.
ఈ నిఘా కెమెరాలను అల్వాల్ ఎస్ హెచ్ ఓ  ప్రశాంత్ ప్రారంభించారు.

ఆయన మాట్లాడుతూ… ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో  సమానం. మీలాగే అందరూ కాలనీవాసులు స్ఫూర్తి పొంది సీసీ కెమెరాలు నియమించుకోవడం వల్ల నేరాల సంఖ్య తగ్గడమే కాకుండా.. ఒకవేళ నేరాలు జరిగితే నేరస్తులను గుర్తించడంలో  సీసీ కెమెరాలు ఎంతో సహాయం చేస్తాయన్నారు. ఈ సీసీ కెమెరాలను సమకూర్చిన కాలనీవాసులను ఎస్ హెచ్ ఓ అభినందించారు.

ఈ కార్యక్రమంలో అల్వాల్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వీరబాబు, సబ్ ఇన్స్పెక్టర్ దేవేందర్, టెక్నికల్ టీం,  పిఎస్ సిబ్బంది, మరియూ కాలనీ వాసులు పాల్గొన్నారు.

నిఘా కెమెరా ఉంటే, నేరస్థుడికి భయం ఉంటుంది. అనే నినాదంతో అల్వాల్ ల్లో జరుగుతున్న ఈ ప్రక్రియతో స్థానికులలో భద్రతాభావం పెరుగుతుంది.

మీ మీ ప్రాంతాలలో సీసీ కెమెరాలు లేకపోతే స్థానిక పోలీసుల సూచన మేరకు వాటిని ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం.

#sidhumaroju

NO COMMENTS

Exit mobile version