Home South Zone Telangana జరిగింది దురదృష్టకరమైన సంఘటన- ఎంఎల్ఏ.|

జరిగింది దురదృష్టకరమైన సంఘటన- ఎంఎల్ఏ.|

0

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి శాసనసభ్యులు  మర్రి రాజశేఖర్ రెడ్డి  సఫిల్ గూడ శ్రీ విజయ దుర్గ కట్ట మైసమ్మ దేవాలయం వద్ద ఇటీవల జరిగిన దుర్చర్యపై తీవ్రంగా స్పందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. ఇటువంటి అరాచక చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులతో చర్చించామని తెలిపారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాద కోణం ఉందా? లేక ఇతర దురుద్దేశంతో జరిగిందా? అన్న అంశాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డీసీపీ శ్రీధర్ తో మాట్లాడినట్లు పేర్కొన్నారు.

ప్రజలందరూ ఈ సమయంలో సమన్వయంతో, ఐక్యతతో ముందుకు సాగాలని, భావోద్రేకాలకు లోనయ్యే సమయం కాదని ఎమ్మెల్యే  సూచించారు.

దేవాలయాలు, ధార్మిక స్థలాలపై ఎలాంటి దాడులు లేదా దుర్చర్యలు జరిగితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రజల శాంతి భద్రతలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం, పోలీస్ శాఖ తీసుకోవాలని ఆయన స్పష్టంగా తెలిపారు. ఇటువంటి ఘటనలు జరగడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.

#sidhumaroju

NO COMMENTS

Exit mobile version