Home South Zone Andhra Pradesh హైకోర్టు ఉత్తర్వులపై ఎస్‌ఐ హెచ్చరిక |

హైకోర్టు ఉత్తర్వులపై ఎస్‌ఐ హెచ్చరిక |

0

శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారు ఉత్తరుల మేరకు పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ డి శ్రీహరి రాజు గారు మరియు ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ బి సూర్య అప్పారావు గారి సూచనలు మేరకు అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించి .

కోడిపందాలకు తయారుచేసిన బరులను డిప్యూటీ తాసిల్దారు గారు మరియు అన్నవరం ఎస్ఐ గారు జాయింట్ గా సందర్శించి, సదరు గ్రామాల్లో తయారు చేసిన బరులను ట్రాక్టర్ తో దున్నించి ధ్వంసం చేసి మరియు వేసిన షామియానా టెంట్లను తొలగించడం జరిగింది..

హైకోర్టు ఉత్తర్వులు ప్రకారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎవరైనా జూద క్రీడలు మరియు పేకాట, గుండాట, కోడిపందాలు, అశ్లీల నృత్యములు మొదలగునవి నిర్వహించిన ఎడల వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేయడమైనది… సంక్రాంతి పండుగను సంప్రదాయ పద్ధతులో నిర్వహించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని గ్రామాల్లో మైకులు ద్వారా తెలియజేయడం జరిగింది….

#Dadala Babji

NO COMMENTS

Exit mobile version