మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని ట్రూ వ్యాల్యూ షో రూమ్ లో ఈరోజు ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది.
ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాద స్థలికి చేరుకున్న రెండు ఫైర్ ఇంజన్లు, మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాప్తించకుండా నిరోధించాయి.
స్థానిక పోలీస్ సిబ్బంది, మరియు ట్రాఫిక్ సిబ్బంది సూచనలు మరింత ఆస్తి నష్టం కలగకుండా ఆపాయి.
ఈ ఘటనలో షోరూమ్ కి సంబంధించిన ఆఫీస్ పూర్తిగా ఆహుతయింది . ఆఫీసులో ఉన్న కంప్యూటర్లు, ఫర్నిచర్, ఫైళ్లు, ఇతరత్రా విలువైన సామాగ్రి పూర్తిగా దగ్ధమైయ్యాయి.
ప్రమాద సమయంలో అక్కడి ప్రాంతంలో చుట్టూ పొగలు, మంటలతో నిండిపోయింది. షోరూం పక్కన ఉన్న షాపుల వాళ్లు, మరియు నివాసితులు భయభ్రాంతులకు గురయ్యారు.
ఈ ప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఈ సంఘటన ఎలా జరిగింది! ఎంత ఆస్తి నష్టం జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
#sidhumaroju
