సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ప్రైవేట్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయని రవాణాశాఖ గుర్తించింది.
దీనిపై అన్నమయ్య జిల్లాలో ఆర్టీఓ అశోక్ ప్రతాప్ రావు, విజయవాడ రవాణాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం రాత్రి మదనపల్లె అమ్మచెరువు మిట్ట వద్ద తనిఖీలు నిర్వహించారు. మదనపల్లె–విజయవాడ రూట్‌లో నడిచే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై అధికారులు కేసు నమోదు చేశారు.
