తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గుముఖం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గి, ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి.
రాబోయే మూడు రోజుల్లో రెండు రాష్ట్రాల్లోనూ పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా పొడి వాతావరణం.
ఉదయం పూట పొగమంచు ఉండనుంది. రాగల ఐదు రోజుల్లో కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పు ఉండదు.
