మేడారానికి పోటెత్తిన భక్తులు
తెలంగాణ : ములుగులోని మేడారం మహా జాతర కోసం భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
ములుగు గట్టమ్మ తల్లి ఆలయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జాగారం నుంచి మేడారం వరకు, కన్నెపల్లి, జంపన్నవాగు, హరిత హోటల్ వరకు వాహనాల రద్దీతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
పార్కింగ్ కోసం వాహనాలను పొలాల్లోకి మళ్లిస్తున్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరగనుంది.
