Home South Zone Telangana శబరిమల యాత్రలో విషాదం |

శబరిమల యాత్రలో విషాదం |

0

శబరిమల యాత్రలో విషాదం., మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటకు చెందిన దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి.

లక్షేట్టిపేట పట్టణంలో వ్యాపారం నిర్వహిస్తున్న సత్యనారాయణ జనరల్ స్టోర్ యజమాని పాలకుర్తి సత్యనారాయణ, ( 63) రమదేవి (59) దంపతులు అయ్యప్ప మాలలో AP16 TG 5299 ఓ ప్రైవేట్ సర్వీస్ లో శబరిమలై దర్శనానికి వెళ్లారు.

15 న అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో కన్యాకుమారి వద్ద బైపాస్ రోడ్ లో నిన్న సాయంత్రం 6-55 నిమిషాలకు అయ్యప్ప స్వాముల కోసం రెండు గంటల సేపు టూరిస్ట్ నిలిపివేశారు.

సముద్ర స్నానం, అక్కడున్న దేవాలయాలు సందర్శించి టూరిస్ట్ ఆపిన చోటికి రాత్రి 9 గంటలకు దంపతులు రోడ్డు దాటుతుండగ ఓ వాహనం ఢీ కొని దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన దంపతుల మృతదేహాలను కన్యాకుమారి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

NO COMMENTS

Exit mobile version