మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్ గిరి నియోజకవర్గంలో సంక్షేమ డోర్ డెలివరీ కార్యక్రమం కొనసాగుతోంది. వెంకటాపురం నేరెడ్ మెట్ డివిజన్లకు చెందిన ఐదుగురు లబ్ధిదారులకు వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.
1.99.500/- సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
అలాగే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులకు రేషన్ కార్డులను కూడా ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా.. పేద మధ్యతరగతి కుటుంబాలు ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
#sidhumaroju
