మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా, శుక్రవారం మదనపల్లె కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్. రెడ్డీ సాహెబ్ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీ రామ్ జీ పథకం నరేగా పథకాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని, కాబట్టి తక్షణమే జీ రామ్ జీ పథకాన్ని రద్దు చేసి, నరేగా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆయన కోరారు.
