Home South Zone Andhra Pradesh 22A భూముల సమస్యపై త్వరలో విధానం: మంత్రి అనగాని |

22A భూముల సమస్యపై త్వరలో విధానం: మంత్రి అనగాని |

0

రెవెన్యూ క్లినిక్‌లతో మంచి ఫలితాలు వస్తున్నాయని వెల్లడి
రీసర్వేలో రైతులను భాగస్వామ్యం చేయాలన్న మంత్రి అనగాని
22ఏ భూ సమస్యలపై రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా త్వరలో విధాన ప్రకటన

చేయనున్నట్లు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూసమస్యలకు పరిష్కారం చూపాలని ఉన్నతాధికారులకు ఆయన సూచించారు.

సీసీఎల్‌ఏ కార్యాలయంలో రెవెన్యూ సమస్యలపై జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. మంత్రివర్గ ఉప సంఘంలో 22ఏ భూములపై చర్చ జరిగిందని, ఉన్నతాధికారులు విధానం రూపొందించిన తర్వాత ప్రభుత్వస్థాయిలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రెవెన్యూ క్లినిక్‌లతో మంచి ఫలితాలు వస్తున్నాయని, వాటిని మరింత సమర్థంగా నిర్వహించాలని సూచించారు.

ఫిబ్రవరి 2 నుంచి పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేపట్టాలని, వాటిలో ఎలాంటి తప్పులు ఉండకూడదని స్పష్టం చేశారు. రీసర్వేలో గత తప్పులు పునరావృతం కాకుండా రైతులను భాగస్వాములుగా చేయాలని మంత్రి ఆదేశించారు. రీసర్వే గడువును 140 రోజులకు పెంచుతూ కొత్త ఎస్‌ఓపీ విడుదల చేసినట్లు తెలిపారు. రైతులు అందుబాటులో లేకుంటే సర్వే వాయిదా వేసి, వారి సమక్షంలోనే నిర్వహించాలని సూచించారు.

NO COMMENTS

Exit mobile version