శనివారం మధ్యాహ్నం పుంగునూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, దుర్గ సముద్రం పంచాయతీ గాండ్లపల్లి గ్రామానికి చెందిన శ్రావ్య చారాల అనే చిన్నారి స్కూలు బస్సు దిగి రోడ్డు దాటుతుండగా.
గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే 108 వాహనం ద్వారా మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు చౌడేపల్లి పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి .
