అసెంబ్లీలో భావి భారత పౌరుల సందడి!

0
1

అమరావతిలోని శాసనసభను శుక్రవారం సుమారు 200 మంది విద్యార్థులు సందర్శించారు. చట్ట సభల పనితీరు, ప్రజా సమస్యలపై చర్చలను వారు ప్రత్యక్షంగా తిలకించారు.

విరామ సమయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విద్యార్థులతో ముచ్చటించి, ఉన్నత లక్ష్యాలతో చదవాలని ఆకాంక్షిస్తూ వారితో ఫోటోలు దిగారు.

ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పించే ఈ పర్యటన పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.