బొమ్మూరులో గిరిజన విద్యార్థినులకు స్టేషనరీ పంపిణీ |

0
1

రాజమండ్రి రూరల్ బొమ్మూరు గిరిజన వసతి గృహంలోని 60 మంది 10వ తరగతి విద్యార్థినులకు హౌసింగ్ పీడీ ఎన్. బుజ్జి స్టేషనరీ అందజేశారు.

విద్యార్థినులు ఒత్తిడి లేకుండా ఆత్మవిశ్వాసంతో చదివి పరీక్షల్లో రాణించాలని ఆమె ఆకాంక్షించారు. పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు.

ఈ సందర్భంగా విద్యార్థినులు తమకు సాయం అందించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.