ములుగు జిల్లా శ్రీ గుంజేడు ముసలమ్మ జాతర పోస్టర్‌ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. మార్చి 4 నుండి 6 వరకు మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి.
మార్చి 4న బోనాలు, 5న అమ్మవారిని గద్దెపైకి తీసుకురావడం, 6న మొక్కుల అనంతరం తిరుగు ప్రయాణం ఉంటాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పూజారులు పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం పటిష్ట ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.










