చీరాల జాతీయ రహదారి–216లోని శ్రీ వినాయక కార్ మెకానిక్ షెడ్‌లో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. షెడ్‌లోకి చొరబడిన దుండగులు బీరువాలోని రూ. 23 వేల నగదుతో పాటు ఒక కారును, కొన్ని ఖరీదైన స్పేర్ పార్ట్స్‌ను అపహరించారు.
ఈ చోరీలో సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
#Narendra










