మదనపల్లె చిన్నారి రిషిక ప్రియ హత్యాచారం కేసులో నిందితుడు కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడంతో నీరుగట్టువారిపల్లిలో ఉత్కంఠత తగ్గుముఖం పట్టింది.
నిందితుడి మరణవార్త తెలియగానే స్థానికులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి బాణాసంచా పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. “న్యాయం గెలిచింది” మరియు “పోలీసులు జిందాబాద్” అంటూ నినాదాలు చేశారు. చిన్నారి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.










