మదనపల్లె ఘటన: చిన్నారి హత్య కేసు నిందితుడు ఆత్మహత్య

0
0

మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన నిందితుడు కులవర్ధన్ మృతదేహం కురబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో లభ్యమైంది.

బాలిక హత్య తర్వాత పరారైన నిందితుడు, పోలీసుల గాలింపునకు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం మదనపల్లెకు తరలించారు. ఈ ఘటనతో జిల్లాలో నెలకొన్న ఉద్రిక్తత దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.