మదనపల్లె ఘటన: డీఐజీ ప్రకటన వెలువడిన గంటల్లోనే నిందితుడి మృతి

0
1

మదనపల్లె చిన్నారి హత్య కేసు నిందితుడు కులవర్ధన్ మృతదేహం కనసానివారిపల్లి చెరువులో లభ్యమైంది.

నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశామని డీఐజీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే అతను శవమై తేలడం కలకలం రేపింది. పోలీసుల వేట నుంచి తప్పించుకోలేక నిందితుడు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఈ ఘటనతో మదనపల్లెలో నెలకొన్న ఉద్రిక్తత కొంత సద్దుమణిగింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.