అన్నమయ్య జిల్లా మదనపల్లి మార్కెట్‌లో టమోటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం మార్కెట్‌కు 53 మెట్రిక్ టన్నుల టమోటాలు దిగుమతి అయ్యాయి. మేలు రకం టమోటాలు 10 కిలోలకు రూ. 125, రెండో రకం రూ. 100, మూడో రకం రూ. 90 ధర పలుకుతున్నాయి.
పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు నిరాశ చెందుతున్నారు.










