సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో మృత్యు విస్ఫోటనం – చెల్లాచెదురైన మృతదేహాలు.

0
1

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో శనివారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో సంభవించిన భీకర పేలుడు పెను విషాదాన్ని నింపింది.

సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ యూనిట్‌లో టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది.

ఈ ప్రమాదంలో 21 మంది కార్మికులు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

మృతుల్లో అత్యధికులు మహిళలే కావడం గమనార్హం. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమై సమీపంలోని పంట పొలాల్లోకి ఎగిరిపడ్డాయి. ఘటన సమయంలో సుమారు 30 మంది కార్మికులు అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది.